Most Popular Indian Celebrities: మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్‌ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత

సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత;

Update: 2025-07-19 05:59 GMT

Most Popular Indian Celebrities:  దేశంలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్ మరియు సమంత రుత్ ప్రభు అగ్రస్థానంలో నిలిచారు. ఆర్మాక్స్ నివేదికల ప్రకారం, ప్రభాస్ చాలా నెలలుగా అత్యంత ప్రజాదరణ పొందిన హీరోగా కొనసాగుతున్నారు. మే 2025 నెలవారీ ర్యాంకింగ్స్‌లో ఆయన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు, అల్లు అర్జున్‌ను నాలుగో స్థానానికి నెట్టేశారు. అక్టోబర్, నవంబర్ 2024 నెలలకు కూడా ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. 'బాహుబలి' చిత్రాలతో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ప్రభాస్, బాలీవుడ్ సూపర్ స్టార్స్‌ను కూడా వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. మహేశ్ బాబు 6 స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో, రామ్ చరణ్ 8వ స్థానంలో, అక్షయ్ కుమార్ 9వ స్థానంలో, నేచురల్ స్టార్ నాని 10వ స్థానంలో నిలిచారు.ర్మాక్స్ నివేదికల ప్రకారం, సమంత అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ రికార్డును సృష్టించారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2024 నెలల్లో ఆమె వరుసగా అగ్రస్థానంలో నిలిచారు. పికా పదుకొణె, కత్రినా కైఫ్ వంటి బాలీవుడ్ ప్రముఖ తారలను కూడా అధిగమించి ఆమె ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. స‌మంత త‌ర్వాత 2వ స్థానంలో అలియాభట్, 3వ స్థానంలో దీపిక పదుకొణె, 4వ స్థానంలో త్రిష, 5వ స్థానంలో కాజల్ అగర్వాల్‌, 6వ స్థానంలో సాయిపల్లవి, 7వ స్థానంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, 8వ స్థానంలో రష్మిక మందన్న, 9వ స్థానంలో కీర్తి సురేష్, 10వ స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నిలిచారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవ్వడం కూడా ఆమె ప్రజాదరణకు ఒక కారణం.

Tags:    

Similar News