Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, నటుడు విజయ్ దేవరకొండ 2026 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ జంట భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకటిగా నిలిచింది.

పెళ్లయి ఎనిమిది నెలలు గడిచిన తర్వాత రష్మిక తన పేరులో దేవరకొండ అనే ఇంటిపేరును ఉపయోగించడం మొదలుపెట్టింది. తాజాగా ఆమె రాసిన ఓ నోట్‌లో రష్మిక మందన్నా అని కాకుండా రష్మిక దేవరకొండ అని సంతకం చేసింది. దీంతో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ ఇంటిపేరును స్వీకరించిందనే చర్చ మొదలైంది.

అయితే ప్రస్తుతానికి రష్మిక అధికారిక పేరు మాత్రం మారలేదు. కానీ తన పబ్లిక్ కమ్యూనికేషన్స్‌లో కొత్త పేరుతో సంతకం చేయడం ద్వారా వివాహం తర్వాతి పేరును ఆమె క్రమంగా స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటించిన తొలి సినిమా ‘రనబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. అభిమానులతో, మీడియాతో వరుసగా ఇంటరాక్ట్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

Tags: