Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

Update: 2026-06-19 15:47 GMT

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. ఏ-1 నుంచి ఏ-10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితులంతా వ్యక్తిగతంగా హాజరైతేనే కేసు విచారణ ప్రారంభమవుతుంది.

పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News