Nagarjuna’s Fitness Secret: నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
సీక్రెట్ ఇదే!
Nagarjuna’s Fitness Secret: టాలీవుడ్‌లో గ్రీకువీరుడు, మన్మధుడు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసు దాటినా ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిజిక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన ఫిట్‌నెస్, లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగార్జున తన ఫిట్‌నెస్ కోసం కఠినమైన డైటింగ్ చేయనని స్పష్టం చేశారు. "నేను ఎప్పుడూ ఆకలితో ఉండి డైటింగ్ చేయలేదు. వేళకు పద్ధతిగా ఆహారం తీసుకుంటాను. అయితే, గత 45 ఏళ్లుగా ఒక్క రోజు కూడా జిమ్ మిస్ అవ్వకుండా వర్కవుట్ చేస్తున్నాను. ఆరోగ్యం ఏమాత్రం సహకరించని సమయంలో తప్ప, మిగిలిన ప్రతిరోజూ వ్యాయామం చేయడం నా అలవాటు," అని ఆయన పేర్కొన్నారు. కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, పాజిటివ్ థింకింగ్ కూడా మనిషిని యంగ్‌గా ఉంచుతుందని ఆయన నమ్ముతారు. 2025 సంవత్సరం తన జీవితంలో ఎంతో ప్రత్యేకం అని నాగార్జున తెలిపారు. ఈ ఏడాది అఖిల్ అక్కినేని వివాహ బంధంలోకి అడుగుపెట్టడం తండ్రిగా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా వారిద్దరూ కలిసి ఉండటం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండటమే తనకు కావాల్సిన పెద్ద బహుమతి అని ఆయన వ్యాఖ్యానించారు.