Thug Life: నెట్ ఫ్లిక్స్ లో థగ్ లైఫ్!

థగ్ లైఫ్;

Update: 2025-06-11 10:01 GMT

Thug Life: విలక్షణ నటుడు కమల్ హాసన్, త్రిష, శింబు, నాజర్, జోజు జార్జ్ తదితరులు నటించిన సినిమా థగ్ లైఫ్. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దురదృష్ట వశాత్తు ఉదయం షో నుండే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కమల్ హాసన్, మణిరత్నం, ఎఆర్ రెహమాన్ ల శక్తివంతమైన కాంబో ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టు కోలేకపోయింది. ప్రమోషన్ల సమయంలో, కమల్ హాసన్ థగ్ లైఫ్ ఎనిమిది వారాల పాటు థియేటర్లలో ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన తర్వాత, డిజిటల్ విడుదలపైనే ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే ఒక నెలలోపు ప్లాట్ఫామ్ లోకి రావచ్చు. ప్రస్తుతానికి, నెట్ ఫ్లిక్స్ ముందస్తు విడుదలకు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని సినిమాల‌ను థియేట‌ర్ల‌లో చూడ‌క‌పోయినా ఓటీటీలో ఎక్కువ మంది చూస్తారు. కంగువా, విడాముయార్చి, రెట్రో లాంటి సినిమాలు దీన్ని ప్రూవ్ చేసి మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు థ‌గ్ లైఫ్ కూడా అదే దారిలో వెళ్లాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ణిర‌త్నం కెరీర్లోనే వీక్ మూవీగా నిలిచిన థ‌గ్ లైఫ్ రిజ‌ల్ట్ ను క‌మల్ హాస‌న్ కూడా ఇప్పట్లో మ‌ర్చిపోలేడు.

Tags:    

Similar News