Ad Worth ₹150 Crores: రూ.150 కోట్లతో యాడ్ ఏంటి సామీ...
యాడ్ ఏంటి సామీ...
Ad Worth ₹150 Crores: రూ. 150 కోట్లతో దర్శకుడు అట్లీ, శ్రీలీల కాంబినేషన్లో రూపొందిస్తున్న భారీ యాడ్ ఫిల్మ్ చర్చనీయాంశంగా మారింది. ఈ యాడ్ చింగ్స్ దేశీ చైనీస్' (Ching's Desi Chinese) ఉత్పత్తులకు సంబంధించింది.
ఈ యాడ్‌లో శ్రీలీలతో పాటు బాలీవుడ్ స్టార్లు రణవీర్ సింగ్ , బాబీ డియోల్ కూడా నటిస్తున్నారు.
ఇది భారతదేశంలో ఇప్పటివరకు తీసిన ప్రకటనలలో అత్యంత ఖరీదైనదిగా చెబుతున్నారు.అట్లీ తన సినిమా తరహాలో భారీ సెట్‌లు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) , మల్టీ-లొకేషన్లలో ఈ యాడ్‌ను చిత్రీకరించారు.
ఒక చిన్నపాటి పాన్-ఇండియా సినిమా బడ్జెట్‌ను మించి ఈ ప్రకటన కోసం ఖర్చు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఈ ప్రచార కార్యక్రమానికి 'ఏజెంట్ చింగ్ అటాక్స్' అనే పేరు పెట్టారట.ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది
అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. దీనికి వర్కింగ్ టైటిల్‌గా 'AA22 x A6' అని పెట్టారు. ఈ సినిమాను దాదాపు రూ.700 కోట్ల నుంచి రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన సినిమాగా తెలుస్తోంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ,మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఇందులో మూడు లేదా నాలుగు విభిన్న పాత్రల్లో (ఫ్యామిలీ ట్రీలో) కనిపిస్తారని, ఇందులో ఒక డైమెన్షన్ ట్రావెలర్ పాత్ర కూడా ఉంటుందని పుకార్లు ఉన్నాయి. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ VFX స్టూడియోలతో అట్లీ, అల్లు అర్జున్ సమావేశమయ్యారు.