A Rare Twist in 2026 New Year: 2026 నూతన సంవత్సరంలో వింత.. 100 ఏళ్ల తర్వాత హోలీ రోజే..

100 ఏళ్ల తర్వాత హోలీ రోజే..

Update: 2025-12-27 10:32 GMT

A Rare Twist in 2026 New Year: సాధారణంగా పండుగలు వెలుగులు నింపితే 2026లో మాత్రం హోలీ పండుగ చంద్రగ్రహణం నీడలో జరుపుకోవాల్సి వస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు కాబట్టి పండుగ జరుపుకునే విషయంలో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

గ్రహణ కాలం - సమయాలు:

2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించనుంది.

గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 3:20 గంటలకు.

గ్రహణం ముగింపు: సాయంత్రం 6:47 గంటలకు.

కనిపించే ప్రాంతం: ఈ చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది.

సూతక్ కాలం - నియమాలు:

భారతదేశంలో గ్రహణం కనిపిస్తుంది కాబట్టి సూతక్ నియమాలు వర్తిస్తాయని పండితులు చెబుతున్నారు.

సూతక్ ప్రారంభం: గ్రహణం పట్టడానికి 9 గంటల ముందు, అంటే మార్చి 3న ఉదయం 6:20 గంటలకే సూతక్ కాలం ప్రారంభమవుతుంది.

నియమాలు: సూతక్ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు. ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఖగోళ శాస్త్రం ఏం చెబుతోంది?

ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. 2026 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి.

శతాబ్దం తర్వాత హోలీ రోజునే చంద్రగ్రహణం రావడం ఒక అరుదైన సంఘటనగా జ్యోతిష్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీని ప్రభావం వివిధ రాశులపై ఏ విధంగా ఉంటుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

Tags:    

Similar News