Sri Kalyana Venkateswara Swamy Brahmotsavam: శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి.

సాయంత్రం 6 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు.

ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.

ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెప్పోత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags: