Chukkala Amavasya: హిందూ సాంప్రదాయంలో ప్రతి అమావాస్యకు ఓ విశిష్టత ఉంది. కానీ, తెలుగు మాసాల్లో నాలుగో నెల అయిన ఆషాఢ మాసం చివరి రోజు వచ్చే అమావాస్యకు మాత్రం అత్యంత ప్రత్యేకత ఉంది! అదే ‘చుక్కల అమావాస్య’. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున ఈ పవిత్రమైన చుక్కల అమావాస్య వచ్చింది. మరి ఏడాదికి ఒక్కసారే వచ్చే ఈ ప్రత్యేక రోజు ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం.. ఆషాఢ మాసంతో ఉత్తరాయణం ముగిసి, పవిత్రమైన ‘దక్షిణాయనం’ ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు అత్యంత సమీపంలో ఉంటారని నమ్ముతారు. అందుకే, ఈ తొలి అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకుంటూ తర్పణాలు విడిచి, దీపారాధన చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు.ఇక ఈ రోజే గంగా స్నానం ఆచరించి, నదులలో దీపాలు వదలడం వల్ల అజ్ఞానం, అనారోగ్యాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు, పెళ్లికాని యువతులు శ్రేయస్సు కోసం గౌరీదేవిని పూజించి రక్ష ధరిస్తే..త్వరలోనే వివాహం కుదురుతుందని పండితులు సూచిస్తున్నారు.

ఆగస్టు 12న వచ్చే ఈ చుక్కల అమావాస్య రోజు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు

మొదటిది.. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో రావిచెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే.. జీవితంలో ఎదురయ్యే అనుకోని ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రెండవది.. నరదృష్టి నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి నిమ్మకాయల పరిహారం చాలా బాగా పనిచేస్తుంది.మూడవది.. పేదలకు అన్నదానం చేయడం, పుణ్య నదుల్లో స్నానం చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది.

Tags: