Rare Venus Yoga in Late September: సెప్టెంబర్ నెలాఖరులో అరుదైన శుక్ర యోగం.. మహాలక్ష్మి కటాక్షంతో ఈ 3 రాశుల వారికి స్వర్ణయుగం..
3 రాశుల వారికి స్వర్ణయుగం..
Rare Venus Yoga in Late September: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల సంచారం వల్ల ఎప్పటికప్పుడు అనేక శుభ యోగాలు రూపుదిద్దుకుంటాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలాఖరులో అత్యంత శక్తిమంతమైన శుక్ర యోగం ఏర్పడబోతోంది. ఈ అరుదైన యోగం ప్రభావంతో ప్రధానంగా మూడు రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సాక్షాత్తూ మహాలక్ష్మి అనుగ్రహం కలగనుండటంతో వీరికి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, అపారమైన సంపద చేకూరనుంది. ఒకరకంగా వీరి జీవితాల్లో స్వర్ణయుగం ప్రారంభం కాబోతోంది. ఆ అదృష్ట రాశుల విశేషాలు ఇక్కడ పరిశీలిద్దాం.
సింహ రాశి - కురవనున్న సిరిసంపదల వర్షం
శుక్ర యోగం సింహ రాశి జాతకులకు అత్యున్నత ప్రయోజనాలను తీసుకురానుంది. మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటంతో ఇంట ధనధాన్యాలకు లోటు ఉండదు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, స్తంభించిపోయిన పనులు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తాయి. నలువైపుల నుంచి ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. వారు చేసే కృషికి తగిన ఫలితాలు దక్కి, విద్య, పోటీ పరీక్షల రంగాలలో తిరుగులేని విజయాలు సాధిస్తారు.
మీన రాశి - అప్పుల బాధల నుంచి పూర్తి విముక్తి
గత కొంతకాలంగా కష్టాలు, సమస్యలతో సతమతమవుతున్న మీన రాశి వారికి ఈ శుక్ర యోగం ఊరటనిస్తుంది. పాత అప్పులు, ఈఎంఐల భారం నుంచి బయటపడటానికి మార్గాలు సుగమమవుతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోవడంతో ఎట్టకేలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. నిలిచిపోయిన రాబడి చేతికి అందుతుంది. విద్యార్థులకు గ్రహాల మద్దతు లభించి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి - ఆకస్మిక ధనలాభం, కీర్తి ప్రతిష్టలు
ధనుస్సు రాశి వారికి శుక్ర యోగం ఊహించని శుభ ఫలితాలను తెచ్చిపెట్టనుంది. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే నూతన అవకాశాలు లభిస్తాయి. అకస్మాత్తుగా ధన లాభం లేదా పూర్వీకుల ఆస్తుల ద్వారా లబ్ధి చేకూరే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆఫీస్ సంబంధిత వివాదాల్లో చిక్కుకున్న వారికి తీర్పు అనుకూలంగా వచ్చి పెద్ద విజయం సాధిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు, పరపతి పెరుగుతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రణాళికలు వేసుకుంటారు.