Eating These Foods After Your Morning Walk: మార్నింగ్ వాక్ తర్వాత ఇవి తింటున్నారా? అయితే జాగ్రత్త!
అయితే జాగ్రత్త!
Eating These Foods After Your Morning Walk: రోజూ ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, వాకింగ్ వల్ల వచ్చే రిజల్ట్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండాలన్నా.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలన్నా.. మార్నింగ్ వాక్ తర్వాత మనం తినే ఫుడ్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. మరి వాకింగ్ లేదా జాగింగ్ తర్వాత బాడీకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని ఇచ్చే ఆ బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్నింగ్ వాక్ పూర్తికాగానే శరీరం కోల్పోయిన కేలరీలను తిరిగి పొందడానికి అరటి పండ్లు తినడం చాలా మంచిది. ఇది శరీరానికి సరిపడా ఎనర్జీని వెంటనే అందిస్తుంది. అలాగే వాకింగ్ తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే సిట్రులిన్, లైకోపిన్ వంటి పోషకాలు బాడీని రిలాక్స్ చేయడమే కాకుండా.. రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. ముఖ్యంగా ఇందులోని సిట్రులిన్ అనేది నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేసి.. ఎక్సర్‌సైజ్ తర్వాత వచ్చే అలసటను తగ్గిస్తుంది. వీటితో పాటు త్వరగా జీర్ణమయ్యే, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ కూడా తాగొచ్చు. ఇది అలసిపోయిన కండరాలను మళ్లీ యాక్టివ్ చేస్తుంది.
ఇక బరువు తగ్గాలనుకునే వారికి మార్నింగ్ వాక్ తర్వాత ఆమ్లెట్ ఒక బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఎందుకంటే గుడ్డులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ మరియు హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మీ బాడీకి మంచి బూస్టింగ్ ఇవ్వాలంటే.. అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండే ప్రోటీన్ షేక్స్ కూడా ట్రై చేయవచ్చు. నాన్-వెజ్ ప్రియులైతే.. వాకింగ్ తర్వాత చికెన్ తీసుకోవడం వల్ల కండరాల పుష్టికి చాలా మంచిది. అయితే దీనిని కూరగాయలు, ఆకుకూరలతో కలిపి తింటే మరింత హెల్దీగా ఉంటుంది.
వీటితో పాటు ప్రోటీన్, క్యాల్షియం, సోడియం ఎక్కువగా ఉండే కాటేజ్ చీజ్ లేదా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే రకరకాల తాజా పండ్లను కూడా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవచ్చు.