Heavy Rush of Devotees in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

దర్శనానికి 20 గంటలు

Update: 2025-12-27 10:27 GMT

Heavy Rush of Devotees in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.

ఇక వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.

Tags:    

Similar News