Wargal Saraswathi Temple: వర్గల్ ప్రసిద్ధ సరస్వతీ టెంపుల్ గురించి ఆసక్తికర విషయాలు

సరస్వతీ టెంపుల్ గురించి ఆసక్తికర విషయాలు

Update: 2025-11-04 07:34 GMT

Wargal Saraswathi Temple: వర్గల్ సరస్వతీ దేవాలయం తెలంగాణలో ముఖ్యంగా బాసర తర్వాత, చదువుల తల్లి సరస్వతి దేవికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ, శక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.దీనిని శ్రీ విద్యా సరస్వతి శనీశ్వరాలయం అని కూడా పిలుస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ గ్రామంలో ఉంది.

ఈ ఆలయం కొండపై నెలకొని ఉంది. పిల్లల అక్షరాభ్యాసం (విద్యాభ్యాసం ప్రారంభించే వేడుక) కోసం ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సాధారణంగా ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం వరకు , సాయంత్రం 4 గంట నుంచి 7 వరకు అక్షరాభ్యాసం నిర్వహించబడుతుంది.

ఈ ఆలయ నిర్మాణానికి శ్రీ యామవరం చంద్రశేఖర శర్మ గారు కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ ఆలయం కంచి మఠం (Kanchi Kamakoti Peetam) ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతి దేవితో పాటు శ్రీ శనీశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి, లక్ష్మీదేవి, శివాలయం కూడా ఉన్నాయి. ఇక్కడ వేద పాఠశాల (Veda Patashala) కూడా నడుస్తోంది.ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ నిత్య అన్నదానం సదుపాయం కలదు.

దర్శన సమయాలు

ఆలయం సోమవారం నుంచి గురువారం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 వరకు

శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు తెరిచి ఉంటుంది.

Tags:    

Similar News