మేడారం జాతర తేదీలు ఖరారు
వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకూ జాతర
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు మూడు కోట్లకు పైగా భక్తులు సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంల ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల సౌకర్యం నిమిత్తం నాలుగు రోజులు అత్యధికంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతారు. తాజాగా వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకూ మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది.
28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు.
29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు.
30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని.
31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది.