Rama’s Elder Sister: రాముడి అక్క ఎవరు.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?;
Rama’s Elder Sister: రాముడికి 'శాంత' అనే అక్క ఉంది. ఆమె దశరథ మహారాజు, కౌసల్యల కుమార్తె. శాంత పుత్రకామేష్టి యాగం కంటే ముందే జన్మించింది. ఆమెకు అంగవైకల్యం ఉండటంతో, మహర్షుల సలహా మేరకు దశరథుడు ఆమెను తన స్నేహితుడైన అంగదేశ రాజు రోమపాదుడికి దత్తత ఇచ్చాడు. రోమపాదుడికి పిల్లలు లేకపోవడంతో ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. శాంత చాలా అందగత్తె. ఆమె వేదాలు, హస్తకళలు, యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించింది.ఒకసారి అంగదేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. దాన్ని నివారించడానికి, శాంత రోమపాదుడి సలహా మేరకు రుష్యశృంగ మహర్షిని అంగదేశానికి తీసుకువస్తుంది. రుష్యశృంగుడు చేసిన యాగం వల్ల వర్షాలు కురిసి దేశం కరువు నుండి బయటపడింది. రోమపాదుడు సంతోషించి తన కుమార్తె శాంతను రుష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. దశరథుడు పుత్ర సంతానం కోసం చేసిన పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించడానికి రుష్యశృంగ మహర్షిని పిలిపించాడు. ఈ యాగం ఫలితంగానే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉన్న బంజారా ప్రాంతంలో శాంత, ఆమె భర్త రుష్యశృంగుడి ఆలయం ఉంది. అక్కడ శాంత దేవి విగ్రహాన్ని పూజిస్తారు.