Rumors Around Diwali: దీపావళిపై వదంతులు..ఏ రోజు జరుపుకోవాలంటే.?
ఏ రోజు జరుపుకోవాలంటే.?
Rumors Around Diwali: తెలుగు రాష్ట్రాలలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా ఐదు రోజుల పండుగ అయినప్పటికీ, ఇందులో నరక చతుర్దశి, దీపావళి (లక్ష్మీ పూజ) అనే రెండు రోజులు ప్రధానమైనవి.
అక్టోబర్ 19న ఆదివారం నరక చతుర్దశి (చీకటిపై వెలుగు విజయం) ఈ రోజు ఏం చేస్తారంటే.. ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించినందుకు గుర్తుగా సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం (నువ్వుల నూనెతో తలస్నానం) చేయడం ఆనవాయితీ. ఈ స్నానం నరక బాధల నుంచి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. సాయంత్రం ఇంటి ముందు దీపాలను వెలిగిస్తారు.
దీపావళి లక్ష్మీ పూజ: అక్టోబ్20నసాయంత్రం వేళ లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం అత్యంత ప్రధానం. ధనం, శ్రేయస్సు కోసం లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. ఇల్లు అంతా దీపాలు, కొవ్వొత్తులు, కాంతివంతమైన లైట్లతో అలంకరిస్తారు. దీనినే దీపోత్సవం అని కూడా అంటారు. పండుగ ఆనందంలో భాగంగా టపాసులు కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం వంటివి చేస్తారు.
దీపావళి పండుగ (లక్ష్మీ పూజ) ఈ సంవత్సరం (2025) అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అమావాస్య తిథి రెండు రోజులు (అక్టోబర్ 20 సాయంత్రం ప్రారంభమై, అక్టోబర్ 21 సాయంత్రం ముగుస్తుంది) ఉండటం వలన కొంత గందరగోళం ఉంది. అయితే, పండితుల సూచనల ప్రకారం, లక్ష్మీ పూజకు అత్యంత శుభప్రదమైన ప్రదోష కాలం (Pradosh Kaal) అక్టోబర్ 20వ తేదీన వస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా చాలా మంది అక్టోబర్ 20, సోమవారంనే దీపావళిని జరుపుకోనున్నారు.