Significance of Kartika Month: కార్తీక మాసం విశిష్టత.. శివకేశవుల అద్వైత రూపం

శివకేశవుల అద్వైత రూపం

Update: 2025-11-05 11:41 GMT

Significance of Kartika Month: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటైన కార్తీక మాసం ఘనంగా ప్రారంభమైంది. దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఈ మాసం మొదలై, నెల రోజుల పాటు భక్త కోటి యావత్తు శివకేశవుల ఆరాధనలో మునిగిపోతుంది. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం' (కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు) అని స్కంద పురాణం ఘోషించిన విధంగా, ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు, పుణ్యకార్యాలకు అత్యంత ఉత్కృష్టమైనదిగా పరిగణించబడుతోంది.

కార్తీక మాసం హరిహరాదులకు (శివ, విష్ణువు) ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ఇరువురినీ కలిపి పూజించడం అద్వైత తత్వాన్ని లోకానికి చాటుతుంది. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో పూర్ణుడై సంచరించడం వలన దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో వచ్చే సోమవారాలు (కార్తీక సోమవార వ్రతం) శివునికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి, శివాలయంలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు నిర్వహించడం ద్వారా విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ మాసంలో తులసి మొక్కకు దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, సత్యనారాయణ వ్రతం ఆచరించడం ద్వారా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది

Tags:    

Similar News