Special Religious Events: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో పలు విశేష పర్వదినాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం జరగనుంది.

సెప్టెంబర్ 13న బలరామ జయంతి, వరాహ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. దీంతో బ్రహ్మోత్సవాల సందడి తిరుమలలో ప్రారంభం కానుంది.

సెప్టెంబర్ 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అదే రోజు ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ సెప్టెంబర్ 19న జరగనుంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 20న శ్రీవారి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22న శ్రీవారి రథోత్సవం జరగనుంది. సెప్టెంబర్ 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 24న శ్రీవారి బాగ్ సవారి జరగనుంది. సెప్టెంబర్ 25న అనంత పద్మనాభ వ్రతంతో పాటు చక్రస్నానం నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ నెలలో వరుసగా పలు విశేష పర్వదినాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

Tags: