Shivaratri Celebrations:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఇవాళ్టి నుంచి 16 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వర క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడనుంది.

మూడు రోజుల పాటు ఈ క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, మొక్కులు చెల్లించుకొనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు,వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు‌. కావున భక్తులు మహాశివరాత్రి ఉత్సవాలకు తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగంలో పుణ్యస్నానాలు ఆచరించి ,కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఉప ప్రధానార్చకులు పనకంటి ఫణీంద్ర శర్మ తెలిపారు.

Tags: