Tirumala Tirupati Devasthanams (TTD): శ్రీవారి ఆలయం వద్ద సరికొత్త టెక్నాలజీ

సరికొత్త టెక్నాలజీ

Update: 2026-02-02 07:00 GMT

Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమలలో భద్రతను పటిష్ఠం చేసేందుకు టీటీడీ అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటూ వాహన సేవల దర్శనాలపై కచ్చితమైన సమాచారాన్ని అందించనున్నాయి. వీటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఈ సాంకేతికత వల్ల భద్రత పెరగడమే కాకుండా, సామాన్య భక్తులకు దర్శనం వేగంగా మరియు పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు లేదా ఎవరైనా తప్పిపోయినప్పుడు వారిని కనిపెట్టడం ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా చాలా సులభం అవుతుంది.

మరోవైపు తిరుమలలో ఆదివారం రాత్రి మాఘ శుద్ధ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Tags:    

Similar News