Tirumala Tirupati Devasthanams (TTD): ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల ఈ–వేలం
టీటీడీలో వస్త్రాల ఈ–వేలం
Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీకి చెందిన వివిధ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వివిధ రకాల వస్త్రాలను ఈ-వేలం వేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు ఈ ఆన్‌లైన్ వేలం ప్రక్రియ కొనసాగనుంది.
ఈ ఈ-వేలంలో మొత్తం 177 లాట్లలో కొత్తవి, ఉపయోగించినవి అలాగే పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు హుండీ కానుకల ద్వారా సమర్పించిన ఈ వస్త్రాలను మార్కెటింగ్ విభాగం క్రమబద్ధీకరించి ఈ వేలాన్ని నిర్వహిస్తోంది.
వేలంలో లభించే ప్రధాన వస్త్రాలు: టర్కీ టవళ్లు, ఆర్డినరీ టవళ్లు లుంగీలు, శాలువాలు బెడ్‌షీట్లు, దిండుకవర్లు (పిల్లో కవర్లు) న్యాప్‌కిన్లు, హ్యాండ్‌కర్చీఫ్‌లు (రుమాళ్లు) బ్లౌజ్‌పీస్‌లు, దుపట్టాలు, పరదాలు హుండీ గలీబులు, ఈర్వాడాలు ఇతర వస్త్ర సామగ్రి
సంప్రదించాల్సిన వివరాలు మరియు వెబ్‌సైట్లు: ఈ ఈ-వేలంలో ఆసక్తిగల వ్యాపారులు మరియు కొనుగోలుదారులు పారదర్శకంగా పాల్గొనవచ్చు. పూర్తి వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలముల విభాగం) ఫోన్ నంబరు 0877-2264429 ను సంప్రదించవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్లు అయిన www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ద్వారా పూర్తి సమారాన్ని తెలుసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.