Venus Direct on November 14: నవంబర్ 14న శుక్రుడి ప్రత్యక్ష సంచారం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, కెరీర్లో అద్భుత విజయాలు..
కెరీర్లో అద్భుత విజయాలు..
Venus Direct on November 14: నవగ్రహాలలో శుక్ర గ్రహాన్ని అత్యంత శుభప్రదమైన, సౌభాగ్య కారకుడైన గ్రహంగా జ్యోతిష్య శాస్త్రం పరిగణిస్తుంది. సంపద, శ్రేయస్సు, ఆకర్షణ, ప్రేమ, దాంపత్య సుఖం, విలాసవంతమైన జీవితానికి శుక్రుడే ప్రధాన కారకుడు. అందుకే శుక్రుని గమనంలో వచ్చే మార్పులు ద్వాదశ రాశుల వారి ఆర్థిక, వ్యక్తిగత జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. దీపావళి తర్వాత, నవంబర్ 14న శుక్రుడు ప్రత్యక్ష సంచారంలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుభ గోచారం కారణంగా నాలుగు రాశుల వారికి విశేషమైన ధనయోగం, కెరీర్లో ఊహించని పురోగతి లభించనున్నాయి.
మేష రాశి: రెట్టింపు లాభాలు.. ఆత్మవిశ్వాసం రెట్టింపు
శుక్రుడి ప్రత్యక్ష గమనం మేష రాశి వారికి ఆర్థికపరంగా పెద్ద ఊరటను ఇస్తుంది. కార్యాలయంలో పై అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ కాలం అద్భుతంగా కలిసివస్తుంది. రెట్టింపు లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు, నూతన వ్యాపార ఒప్పందాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి.
కన్యా రాశి: కోర్టు కేసుల్లో విజయం.. సొంతింటి కల సాకారం
కన్యా రాశి వారికి శుక్ర సంచారం సర్వతోముఖాభివృద్ధిని తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతోద్యోగం లేదా కార్యాలయంలో కీలక బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయి. కోర్టు కేసులు, దీర్ఘకాలిక వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. చాలా కాలంగా సొంతిల్లు లేదా కొత్త వాహనం కొనాలనుకుంటున్న వారి కల నెరవేరుతుంది. వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరకడంతో పాటు వ్యాపారస్తులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం చేసే కొత్త పెట్టుబడులు దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత, మానసిక ఒత్తిళ్లు తొలగిపోయి జీవితంలో ప్రశాంతత, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
కుంభ రాశి: పెరిగే ఆదాయం.. తగ్గే పని ఒత్తిడి
కుంభ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో బలపడుతుంది. నిలిచిపోయిన సొమ్ము చేతికి అందడంతో పాటు ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పనిభారం తగ్గి, వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మీ శ్రమకు యాజమాన్యం నుంచి మంచి ప్రయోజనాలు అందుతాయి. వ్యక్తిగత ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో వివాదాలు సమసిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.