Pujas During Periods: పీరియడ్స్ టైమ్‌లో మహిళలు పూజలు చేస్తే ఏమవుతుంది..?

మహిళలు పూజలు చేస్తే ఏమవుతుంది..?;

Update: 2025-07-08 16:03 GMT

Pujas During Periods: సమాజంలో ఋతుస్రావం అపవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీని కారణంగా.. ఋతుస్రావం సమయంలో స్త్రీలపై అనేక ఆంక్షలు విధించబడతాయి. అయితే, ఋతుస్రావం అనేది ఒక సాధారణ, సహజమైన ప్రక్రియ అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇది ఏ విధమైన అశుభం లేదా దోషం కాదని ఆయన స్పష్టం చేశారు. గతం, ఋతుస్రావం సమయంలో స్త్రీలను ఇంటి బయట ఉంచేవారు. ఇది వారికి విశ్రాంతిని ఇవ్వడానికి ఉద్దేశించబడింది. కానీ ఈ పద్ధతులు వారిపై మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఋతుస్రావం ఏ మతపరమైన కార్యక్రమాలకూ ఆటంకం కలిగించదని అన్నారు. దేవాలయాలకు వెళ్లకుండా, పూజలు చేయకుండా, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఋతుస్రావం వారిని నిరోధించదని చెబుతున్నారు.

అయితే, ఋతుస్రావం సమయంలో స్త్రీలలో ఒక రకమైన మానసిక రుగ్మత ఉండవచ్చు. ఈ అసౌకర్యాన్ని తగ్గించడాని గోమూత్రంతో స్నానం చేయాలని సూచించారు. గోమూత్రం పవిత్రమైనదని. అది మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. అందువల్ల గోమూత్రంతో స్నానం చేయడం వల్ల స్త్రీలు ఋతుస్రావం సమయంలో మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారని చెబుతారు.

Tags:    

Similar News