Second Solar Eclipse of This Year: ఈ ఏడాదది రెండో సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? మన దేశంలో కనిపిస్తుందా?
మన దేశంలో కనిపిస్తుందా?;
Second Solar Eclipse of This Year: 2025లో రెండవ సూర్యగ్రహణం త్వరలో సంభవించనుంది. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంఘటన కారణంగా, సూర్యుని ప్రతిబింబం చంద్రుని వెనుక కొద్దిసేపు అస్పష్టంగా ఉంటుంది. దీనిని సూర్యగ్రహణం అంటారు. కానీ సూర్యగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2025 లో మొత్తం 4 గ్రహణాలు ఉన్నాయి. వాటిలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉంటాయి.
రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు..?
భారత కాలమానం ప్రకారం.. సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3.24 గంటలకు రెండో సూర్య గ్రహణం ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి 4.24 గంటలు. సెప్టెంబర్ 21న సంభవించే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అవుతుంది.
ఈ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. మన దేశంలో కనిపించదు. ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం న్యూజిలాండ్, ఫిజి, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాలలో కనిపిస్తుంది.