God Should Be Worshipped: ఏ దేవుడికి ఏ రోజు పూజ చేస్తే మంచిది?
ఏ రోజు పూజ చేస్తే మంచిది?
God Should Be Worshipped: సనాతన ధర్మంలో ప్రతి రోజు ఒక పవిత్రమైన దేవతకు అంకితం చేయబడింది. వారంలోని ఏడు రోజులకు ఏడు రకాల గ్రహాలు, దేవతలు అధిపతులుగా ఉంటారు. వారిని ఆ రోజున పూజించడం వల్ల ఆయా దేవుళ్ళ అనుగ్రహం పొందవచ్చని, కష్టాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసం ఆధారంగానే, వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఆచారంలో ఉంది.
ఆదివారం: ఈ రోజు సూర్య భగవానుడికి పూజ చేయడం శుభకరం. సూర్య నమస్కారాలు చేయడం, ఎర్రని పూలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
సోమవారం: ఈ రోజు పరమశివుడికి చాలా పవిత్రమైనది. శివాలయానికి వెళ్లి పాలతో అభిషేకం చేయడం, బిల్వ పత్రాలను సమర్పించడం మంచిది.
మంగళవారం: ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామికి, హనుమంతుడికి పూజ చేయడం విశేషమైనది. ముఖ్యంగా దుర్గమ్మకు కూడా మంగళవారం పూజలు చేస్తారు.
బుధవారం: ఈ రోజు విఘ్నేశ్వరుడికి, బుధుడికి పూజ చేయడం మంచిది. పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది.
గురువారం: ఈ రోజు సాయిబాబాకు, గురు గ్రహానికి పూజ చేయడం శ్రేయస్కరం. విష్ణుమూర్తికి కూడా ఈ రోజు పూజలు చేస్తారు.
శుక్రవారం: ఈ రోజు లక్ష్మీదేవికి, దుర్గాదేవికి, సంతోషిమాతకు పూజ చేయడం చాలా మంచిది. ప్రత్యేకించి ఆడవారు ఈ రోజు పూజలు చేసి, ఉపవాసం ఉంటారు.
శనివారం: ఈ రోజు శని దేవుడికి, ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్లని వస్త్రాలు ధరించడం మంచిది.