30 Wicks Used on Poli Padyami: పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?
30 వత్తులు ఎందుకు?
30 Wicks Used on Poli Padyami: కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.
పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే ఈ శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. భక్తి, శ్రద్ధల మూలంగా ఈ గొప్ప ఫలాలు అందడం మన అదృష్టం.
భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.