Girls Apply Henna on Atla Taddi: అట్ల తద్ది రోజున అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
Girls Apply Henna on Atla Taddi: అట్ల తద్ది రోజున గోరింటాకు పెట్టుకోవడం మాంగల్యానికి చిహ్నం. అందుకే ఈ పండుగను గోరింటాకు పండుగ అని కూడా అంటారు. గోరింటాకు ధరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి, మాంగల్య సౌభాగ్యం పెరుగుతుందని స్త్రీలు నమ్ముతారు. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్త్రీల శ్రేయస్సు కోసం ఏర్పడిన ఈ ఆచారాన్ని వివాహిత, అవివాహిత యువతులు పాటిస్తారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత అదృష్టం అని విశ్వాసం.
అట్ల తద్దిని చాలామంది విందు, వినోదాల పండుగగా భావిస్తారు. కానీ దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య విశేషాలున్నాయి. పూర్వం నారదుడి సూచన మేరకు గౌరీదేవి ఈ వ్రతం చేసిందట. వ్రతంలో భాగంగా చంద్రుడిని ఆరాధిస్తే కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని నమ్ముతారు. రోజంతా ఉపవాసం జీర్ణక్రియకు మంచిది. ఆటపాటల వల్ల శారీరక వ్యాయామం, మానసిక ఉల్లాసం లభిస్తుంది. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకున్నట్లవుతుంది.
గౌరీదేవి(పార్వతి), శివుడిని తన భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉన్నప్పుడు, నారదముని ఆమె సంకల్పం తెలుసుకున్నారు. ఆమె కోరిక ఫలించడం కోసం చంద్రోదయ ఉమావ్రతంగా పిలిచే ఈ అట్ల తదియ వ్రతం చేయమని సూచించారు. ఆయన ప్రోద్బలంతో పార్వతీ దేవి ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించి, తాను కోరుకున్న శివపరమేశ్వరుడిని పతిగా పొందింది. అందుకే పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.