Yadagiri Gutta : యాదగిరిగుట్ట కు మూడు ఐఎస్ఓ, గుడ్ గవర్నన్స్ పురస్కారాలు
దేశంలోనే ఎనర్జీ ఆడిట్ ను నిర్వహించిన తొలి ఆలయంగా యాదగిరిగుట్ట;
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయానికి నాలుగు ISO 9001 , ISO 22000 లతో కలిపి నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు యాదగిరి గుట్ట ఆలయానికి లభించాయి. దేశంలోనే ఎనర్జి ఆడిట్ నిర్వహించిన మొట్ట మొదటి ఆలయంగా, స్వామివారి అన్న, ప్రసాదాల విషయంలో అత్యంత ఉన్నత ప్రమాణాలు, గుట్ట సందర్శనకు వచ్చే యాత్రికులకు మెరుగైన , సంతృప్తికర సౌకర్యాలు కల్పించడం, భక్తులకు సంతృప్తికరమైన దైవ దర్శనం కల్పించడం, తదితర అంశాలకు ఈ నాలుగు అవార్డులు లభించాయి. గత రెండు నెలలుగా విజయవంతంగా ఐఎస్ఓ ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్, ఆడిట్ ను HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆధ్వర్యంలో గుట్టలో నిర్వహించారు.. కాగా ఈ ISO సర్టిఫికెట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయ, సి.ఎస్ రామకృష్ణా రావు ల సమక్షంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ఎండోమెంట్ కమీషనర్, యాదగిరిగుట్ట కార్యనిర్వహణాధికారి వెంకట్ రావు లకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ బాధ్యులు ఆలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.