Yogini Ekadashi: రేపే యోగిని ఏకాదశి.. అంటే ఏంటి.? ఏం చేయాలి
అంటే ఏంటి.? ఏం చేయాలి;
Yogini Ekadashi: యోగిని ఏకాదశి ప్రాముఖ్యత హిందూ గ్రంథాల ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస నియమాలను పాటించడం ద్వారా.. ఒక వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు
పద్మ పురాణం ప్రకారం రేపు యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి.. లక్ష్మీనారాయణులను పూజిస్తే ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఎలా పూజ చేయాలి
యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.
పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదాచిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. గంగాజలంతో అభిషేకించాలి.
శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే ఈరోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి.
విష్ణుమూర్తికి పసుపు రంగు పూల హారాన్ని సమర్పించాలి.
శ్రీహరి పూజలో పండ్లు, స్వీట్లు, పువ్వులు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.
యోగినీ ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి. మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి.
ఇవి దానం చేయండి..
యోగినీ ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి.
యోగినీ ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయడం వల్ల తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు.