MLC Gopi Murthy : డీఎస్సీ 2025 సెలెక్షన్ లిస్టు విడుదల చేయాలి

పిడిఎఫ్ శాసనమండలి సభ్యుడు బొర్రా గోపి మూర్తి;

Update: 2025-08-28 09:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల విడుదలైన డీఎస్సీ-2025 సెలెక్షన్ లిస్టుతో పాటు కేటగిరి వారి కటాఫ్ మార్కులను విడుదల చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి కోరారు. డీఎస్సీ 2025 సెలెక్షన్ కు సంబంధించి అర్హత పొందినటువంటి అభ్యర్థులకు ఆన్లైన్ లో కాల్ లెటర్లు పంపటం జరిగింది. ఈ విధంగా చేయడం వలన కొంతమంది అర్హత సాధించిన వాళ్ళకి కాల్ లీటర్లు రాలేదు అనే అపోహలు ఉన్నాయి.వివిధ రిజర్వడ్ కేటగిరీ వారు ఓపెన్ లో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వడ్ కేటగిరీ లో చూపించారు అంటున్నారు కావున అర్హత సాధించినటువంటి వారి జాబితా విడుదల చేస్తే ఇటువంటి అపోహలన్నింటికీ చెక్ పెట్టవచ్చని గోపిమూర్తి అన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ 2025 కి సంబంధించి పలు సమస్యల మీద డీఎస్సీ కన్వీనర్, పాఠశాల విద్యా కమిషనర్, పాఠశాల ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖామంత్రి లోకేష్ లకు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్సీ గోపిమూర్తి తెలిపారు. ప్రధానంగా డీఎస్సీ 2025 అభ్యర్థుల గందరగోళాన్ని నివారించడానికి సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తూ కేటగిరీ వారి కటాఫ్ మార్కులను విడుదల చేయాలని, అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే సందర్భంలో పోస్టుల ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకునే సందర్భంలో పొరపాటున గాని లేక అవగాహన లేక గాని లోయర్ క్యాడర్ పోస్టు ముందు పెట్టి తదుపరి హయ్యర్ క్యాడర్ పోస్టు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. అటువంటి వారికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని దూరవిద్య ద్వారా విద్యను అభ్యసించిన వారికి డీఎస్సీ రాయటానికి అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ సెలెక్ట్ అయ్యేసరికి మీకు అర్హత లేదని చెప్పడం సరికాదని వారిని కూడా సెలక్షన్ లిస్ట్ లో చేర్చాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. అదేవిధంగా డి ఎస్ సి అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హతలు సాధించి తదుపరి సర్టిఫికెట్లు వచ్చిన వారినీ ఉద్యోగ అర్హత సాధిస్తే వారిని కూడా సెలక్షన్ లిస్ట్లోకి చేర్చాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News