Consuming Too Much Alcohol Warning Signs: అతిగా మద్యం సేవిస్తున్నారా.?

మద్యం సేవిస్తున్నారా.?

Update: 2025-11-19 04:50 GMT

Consuming Too Much Alcohol Warning Signs: అతిగా మద్యం సేవించడం వల్ల చిన్న వయసులోనే తీవ్రమైన మెదడు రక్తస్రావం (Cerebral Hemorrhage/ICH) వచ్చే ప్రమాదం ఉందని ఒక US అధ్యయనంలో వెల్లడైంది.

అతిగా మద్యం సేవించేవారికి, తాగని వారితో పోలిస్తే, చిన్న వయసులోనే మెదడు రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది.భారీగా మద్యం సేవించడం వల్ల ప్లేట్‌లెట్స్ (రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవి) సరిగా పనిచేయవు, దీంతో రక్తం గడ్డకట్టే సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ కారణంగా పెద్ద రక్తస్రావాలు సంభవించే అవకాశం ఉంది.

అధ్యయనాల ప్రకారం

రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ తాగేవారిలో మెదడు రక్తస్రావాలు పెద్దవిగా, లోతైన ప్రాంతాల్లో సంభవించాయి. వీరిలో బ్లీడింగ్ సంభవించినప్పుడు సగటు వయస్సు కేవలం 64 సంవత్సరాలు కాగా, తాగని వారిలో సగటు వయస్సు 75 సంవత్సరాలుగా ఉంది.అతిగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు (Blood Pressure) పెరిగి, మెదడులోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయని, అవి లీక్ అవడానికి లేదా పగిలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం, వయస్సు పెరిగే కొద్దీ మెదడు కుంచించుకుపోతుంది. మద్యపానం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.దీనివల్ల పుర్రె (Skull, మెదడు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఈ సమయంలో చిన్న గాయం తగిలినా, రక్తనాళాలు తెగిపోయి తీవ్రమైన రక్తస్రావం (ఉదాహరణకు, సబ్‌డ్యూరల్ హెమరేజ్) జరిగే ప్రమాదం పెరుగుతుంది.

Tags:    

Similar News