Sleep Less Than 7 Hours: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే శరీరంలో వచ్చే డేంజర్ మార్పులు ఇవే..

శరీరంలో వచ్చే డేంజర్ మార్పులు ఇవే..

Update: 2025-10-06 12:53 GMT

Sleep Less Than 7 Hours: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. అనేక అధ్యయనాలు నిద్ర యొక్క ప్రాముఖ్యతను నిరూపించాయి. శరీరం సరిగా విశ్రాంతి తీసుకోనప్పుడు, మొదట్లో అలసట, చిరాకు మాత్రమే వస్తాయి అనుకుంటాం. కానీ దీర్ఘకాలికంగా రాత్రి 7 గంటల కంటే తక్కువ నిద్ర పోవడం వలన క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం మన శరీరానికి ఎలాంటి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

7 గంటల కంటే తక్కువ నిద్రపోతే వచ్చే 9 ప్రమాదాలు

గుండెకు ముప్పు: రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.

జ్ఞాపకశక్తి మాయం: నిద్ర లేమి మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి దారితీయడమే కాకుండా పనులపై ఏకాగ్రత పెట్టే సామర్థ్యం కూడా తగ్గుతుంది.

ఇమ్యూనిటీ డౌన్: తగినంత నిద్ర లేకపోతే మన శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, జబ్బులు వేగంగా వ్యాపిస్తాయి. ఆరోగ్య నిపుణులు అందుకే రోజూ కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి అంటున్నారు.

బరువు పెరుగుతారు: రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు అస్థిరమవుతాయి. దీనివల్ల ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

షుగర్ లెవెల్స్ పైకి: నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

మానసిక సమస్యలు: తక్కువ నిద్ర, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తాయి.

చర్మ సౌందర్యం దెబ్బతింటుంది: అవసరానికి మించి తక్కువ నిద్రపోవడం వల్ల మీ ముఖ సౌందర్యం తగ్గుతుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలు ముడతలకు కూడా దారితీస్తుంది.

హార్మోన్ల ఇబ్బందులు: పురుషులు, స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

జీర్ణ సమస్యలు: తగినంత నిద్ర లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు తీవ్రమవుతాయి.

కేవలం పని, డబ్బు కోసమే కాదు మీ ఆరోగ్యం కోసం కూడా ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. మీ నిద్ర అలవాట్లు మార్చుకుని ఆరోగ్యంగా జీవించండి.

Tags:    

Similar News