Sauté Onions Without Using Oil: నూనె లేకుండానే ఉల్లిపాయలను ఎలా వేయించాలో తెలుసా?

ఉల్లిపాయలను ఎలా వేయించాలో తెలుసా?

Update: 2025-08-11 15:20 GMT

Sauté Onions Without Using Oil: వంటల్లో నూనె వాడకం తగ్గించడం నేటి ట్రెండ్. నూనె ధరలు పెరగడంతో చాలామంది నూనె లేకుండా వంట చేయడం నేర్చుకుంటున్నారు. కొందరు పూర్తిగా నూనె వాడకుండా వండుతుండగా, మరికొందరు తక్కువ నూనెతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, మీకు ఇష్టమైన బిర్యానీ కోసం ఉల్లిపాయలు వేయించడానికి ఎక్కువ నూనె అవసరం అవుతుంది. కానీ, నూనె లేకుండానే బిర్యానీకి ఉల్లిపాయలు ఎలా వేయించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

నూనె లేకుండా ఉల్లిపాయలు వేయించే పద్ధతి:

బిర్యానీకి ఎక్కువగా నూనె అవసరమయ్యేది ఉల్లిపాయలు వేయించడానికి. నూనె లేకుండా ఉల్లిపాయలు వేయించడానికి రవ్వను ఉపయోగించవచ్చు. కేవలం ఒక కప్పు రవ్వ ఉంటే చాలు, పని సులభం అవుతుంది.

ముందుగా, ఒక గిన్నెలో రవ్వ వేసి బాగా వేడి చేయండి.

రవ్వ వేడెక్కాక, దానికి సన్నగా తరిగిన ఉల్లిపాయలను కలపండి.

రవ్వ వేడెక్కుతున్న కొద్దీ, అది ఉల్లిపాయల్లోని నూనెను పీల్చుకుంటుంది.

నెమ్మదిగా ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారినప్పుడు వాటిని బయటకు తీయండి.

మీకు అవసరమైనంతవరకు ఉల్లిపాయలను ఈ విధంగా వేయించుకోవచ్చు. అయితే మరీ ఎక్కువ వేగించి మాడిపోకుండా జాగ్రత్తపడండి.

ఆరోగ్యానికి మంచిది

నూనె లేకుండా వంట చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదే. తక్కువ ధర కలిగిన నూనెలను ఉపయోగించి అనారోగ్యాలను ఆహ్వానించే బదులు, నూనె వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం మంచిది. ఇది మీ శరీరానికి చాలా మేలు చేస్తుంది.

Tags:    

Similar News