Eating Dates in the Morning: ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే శరీరానికి లభించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు అని వైద్యులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, చాలామందిని వేధించే మలబద్ధకం సమస్యను సమూలంగా నివారిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన తక్షణ శక్తిని ఇవి అందిస్తాయి.

కేవలం శారీరక శక్తి మాత్రమే కాకుండా, మెదడు పనితీరుపై కూడా ఖర్జూరాలు అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు ఏకాగ్రత దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు అంటే రక్తహీనతతో బాధపడేవారు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. అందుకే గర్భిణులు, ఎదుగుతున్న పిల్లలకు ఖర్జూరాలను ఒక వరంగా చెప్పవచ్చు. ఇవి ఎముకల పుష్టికి, కండరాల దృఢత్వానికి కూడా ఎంతో తోడ్పడతాయి.

అయితే వీటిని నేరుగా తినడం కంటే రాత్రిపూట నీళ్లలో లేదా పాలలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. ఇలా నానబెట్టడం వల్ల ఖర్జూరంలోని పోషకాలను మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఇది శరీరానికి చలవ చేయడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం నాలుగైదు ఖర్జూరాలను అలవాటు చేసుకుంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: