Feeling Overwhelmed by Stress: ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ ఆహారాలతో చెక్ పెట్టండి

ఈ ఆహారాలతో చెక్ పెట్టండి

Update: 2025-12-22 05:33 GMT

Feeling Overwhelmed by Stress: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక చింతలు మనిషిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి. అయితే, కేవలం అలవాట్లే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా ఈ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని మాయం చేసే ఆ అద్భుతమైన ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన మూడ్‌ని తక్షణమే మెరుగుపరుస్తాయి. అయితే ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

అరటిపండు

అరటిపండులో విటమిన్ బి6, పొటాషియం, ట్రిప్టోఫాన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, మానసిక స్థితిని సమతుల్యం చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. తక్షణ శక్తిని ఇవ్వడంలో కూడా ఇది మేటి.

బాదం, వాల్‌నట్స్

గింజ పప్పుల్లో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాల్‌నట్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం కొన్ని బాదం గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.

బెర్రీలు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను నియంత్రించి, మనసును ఉల్లాసంగా ఉంచుతాయి.

గ్రీన్ టీ

సాధారణ టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని అలవాటు చేసుకోండి. ఇందులో ఉండే ఎల్-థియనిన్ అనే సమ్మేళనం మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. దీనివల్ల రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది.

చిలగడదుంపలు

వీటిలో ఉండే విటమిన్ సి, పొటాషియం ఒత్తిడి వల్ల కలిగే శారీరక అలసటను తగ్గిస్తాయి. కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

ఆహారంతో పాటు ప్రతిరోజూ కాసేపు యోగా, ధ్యానం, సరిపడా నిద్ర ఉంటే ఒత్తిడి మీ దరి చేరదు. ఆరోగ్యకరమైన ఆహారమే.. ప్రశాంతమైన జీవితానికి తొలి మెట్టు..

Tags:    

Similar News