Sleeping Late Increases Risk of Heart Attack and Stroke: ఆలస్యంగా నిద్రపోతున్నారా? గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం

గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం

Update: 2026-02-03 08:56 GMT

Sleeping Late Increases Risk of Heart Attack and Stroke: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి వల్లనో లేదా సోషల్ మీడియా ప్రభావం వల్లనో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. అయితే, ఈ అలవాటు ప్రాణాంతకమని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తమ తాజా అధ్యయనంలో హెచ్చరించింది. రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోని వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. మనం నిద్రపోయే సమయం మారినప్పుడు మన శరీరంలోని సహజ సిద్ధమైన 'బాడీ క్లాక్' దెబ్బతింటుంది. దీనివల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటులో మార్పులు సంభవిస్తాయి. ఈ అధ్యయనం ప్రకారం, రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారికి గుండె జబ్బుల రిస్క్ ఇతరుల కంటే 16 శాతం ఎక్కువగా ఉంటోంది. వీటికి తోడు సరైన వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ (ధూమపానం) అలవాటు ఉంటే ఈ ప్రమాదం మరింత తీవ్రమవుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన గుండె కోసం ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News