Troubled by Menstrual Pain: నెలసరి నొప్పి వేధిస్తోందా? ఈ సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!

ఈ సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!

Update: 2026-01-16 15:55 GMT

Troubled by Menstrual Pain: నెలసరి సమయంలో చాలా మంది మహిళలు తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ పీరియడ్ పెయిన్స్ నుండి సహజంగా ఉపశమనం పొందాలంటే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతను సరిచేసే , శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

ఎండు ద్రాక్షను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది, ఇది నెలసరి సమయంలో వచ్చే అలసటను తగ్గిస్తుంది. అలాగే, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌ను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కండరాల తిమ్మిర్లను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.

అరటి చెట్టులోని ప్రతి భాగం మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులోని పొటాషియం నొప్పిని తగ్గిస్తే, అరటి కాయ, అరటి పువ్వు వంటకాలు హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా 'ప్రొజెస్టెరాన్' హార్మోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా అరటి పువ్వు అధిక రక్తస్రావాన్ని కూడా నియంత్రిస్తుంది. వీటితో పాటు సరైన మోతాదులో నీరు తీసుకోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల నెలసరి రోజులు హాయిగా గడిచిపోతాయి.

Tags:    

Similar News