Blood Sugar Isn’t Dropping: రోజూ వాకింగ్ చేస్తున్నా షుగర్ తగ్గట్లేదా?
షుగర్ తగ్గట్లేదా?
Blood Sugar Isn’t Dropping: డయాబెటిస్ నియంత్రణలో ఉండాలని మీరు రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయినా సరే షుగర్ లెవల్స్ తగ్గడం లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వాకింగ్ ఒక్కటే సరిపోదు.. దానికి తోడు ఈ చిన్న మార్పులు చేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యుల ప్రకారం.. రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంలో మన శరీరంలోని 'అస్థి కండరాలు' (Skeletal Muscles) కీలక పాత్ర పోషిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల పరిమాణం సహజంగా తగ్గుతుంది. అంతేకాకుండా, రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడి, గ్లూకోజ్‌ను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే, కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా, కండరాల బలంపై (Muscle Strength) కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
అదే 'రెసిస్టెన్స్ ట్రైనింగ్'. అంటే, కండరాలకు కొంత శ్రమను లేదా బరువును తట్టుకునేలా చేయడం. దీనివల్ల కండరాలు గ్లూకోజ్, ఇన్సులిన్‌కు మరింత చురుకుగా స్పందిస్తాయి. దీని ప్రభావం ఒక్కసారి చేసినా సరే, రోజంతా శరీరంలో ఉంటుంది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే ఈ రెండు సులభమైన వ్యాయామాలు చేయవచ్చు
చైర్ స్టాండ్స్: కుర్చీలో కూర్చుని లేవడం, మళ్ళీ కూర్చోవడం. ఇది తొడ కండరాలకు మంచి వ్యాయామం.
ప్లాంక్స్: శరీరాన్ని నేలపై స్థిరంగా ఉంచడం. ఇది కోర్ కండరాలను బలపరుస్తుంది."
ఈ 10 నిమిషాల వ్యాయామం అంటే వాకింగ్‌కు ప్రత్యామ్నాయం కాదు. మీ రోజువారీ వాకింగ్, డైట్, మందులతో పాటు దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ క్రమం తప్పకుండా చేయడం వల్ల, టైప్-2 డయాబెటిస్ రోగుల్లో HbA1c స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.