Oats: ఓట్స్: ఉడికించి తింటే మంచిదా.. రాత్రంతా నానబెట్టి తింటే మంచిదా?

రాత్రంతా నానబెట్టి తింటే మంచిదా?

Update: 2026-06-10 12:57 GMT

Oats: బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునే వారికి ఓట్స్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. అయితే ఈ మధ్య కాలంలో ఓట్స్‌ను స్టవ్ మీద ఉడికించి తినడం కంటే, రాత్రంతా పాలు లేదా పెరుగులో నానబెట్టి ‘ఓవర్‌నైట్ ఓట్స్’ రూపంలో తినడం ఒక ట్రెండ్‌గా మారింది. పచ్చి ఓట్స్‌ను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటిలో ఉండే 'ఫైటిక్ యాసిడ్' అనే అంశం విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల ఓట్స్‌లోని ఐరన్, జింక్ వంటి పోషకాలను మన శరీరం మరింత సులభంగా గ్రహిస్తుందని, అలాగే ఇది జీర్ణక్రియకు చాలా మంచిదని కొందరు నిపుణులు చెప్తారు.

కానీ, ఉడికించిన ఓట్స్‌ వల్ల కూడా శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఓట్స్‌ను వేడి చేయడం వల్ల అందులో ఉండే 'బీటా-గ్లూకాన్' అనే ఫైబర్ మరింత యాక్టివ్ అవుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పైగా చలికాలంలో లేదా వర్షాకాలంలో ఉదయాన్నే వేడివేడిగా ఓట్స్ గంజి తాగడం వల్ల పొట్టకు హాయిగా ఉండటమే కాకుండా,l ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది.

చివరగా తేలింది ఏంటంటే.. ఈ రెండు పద్ధతుల్లోనూ ఓట్స్ శరీరానికి మేలే చేస్తాయి. మీకు బరువు తగ్గడంతో పాటు పోషకాలు పూర్తిగా అందాలి, సమయం కలిసిరావాలి అనుకుంటే 'ఓవర్‌నైట్ ఓట్స్' బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా గుండె ఆరోగ్యం, జీర్ణశక్తి మెరుగుపడాలి, ఉదయాన్నే వేడి ఆహారం తినాలి అనుకుంటే 'ఉడికించిన ఓట్స్' ఉత్తమం. అయితే, ప్యాకెట్లలో దొరికే ఇన్‌స్టంట్ ఫ్లేవర్డ్ ఓట్స్‌ కంటే రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్‌ను వాడటమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.

Tags:    

Similar News