Attacks on Hindus in Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని హిందూ సంఘం డిమాండ్‌

ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని హిందూ సంఘం డిమాండ్‌

Update: 2026-01-13 14:12 GMT

Attacks on Hindus in Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని ప్రముఖ హిందూ సంఘం ఎన్నికల సంఘంతో సమావేశమై కీలక డిమాండ్‌లు చేసింది. ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా హిందూ ఓటర్లకు అదనపు రక్షణ కల్పించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మైనార్టీలకు ఎలాంటి భద్రతా లేదని, ముఖ్యంగా దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించింది. సురక్షితంగా ఓటు వేసేందుకు ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

ఇటీవల బంగ్లాదేశ్‌ విద్యార్థి నాయకుడు ఉస్మాన్‌ హాదీ హత్యతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి నుంచి హిందువులపై దాడులు అవ్యాహతంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘం తన డిమాండ్‌లతో ముందుకు వచ్చింది. ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని ఆ సంఘం నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News