Religious Clashes in Nepal: నేపాల్‌లో మత ఘర్షణలు.. భారత్ సరిహద్దు పూర్తిగా మూసివేత

భారత్ సరిహద్దు పూర్తిగా మూసివేత

Update: 2026-01-06 09:40 GMT

Religious Clashes in Nepal: హిమాలయ దేశం నేపాల్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ధనుషా జిల్లాలో ఒక ప్రార్థనా స్థలాన్ని (మసీదును) దుండగులు ధ్వంసం చేయడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పర్సా, బీర్‌గంజ్, రాఉతహట్ తదితర ప్రాంతాల్లో భారీ నిరసనలు చెలరేగాయి.

కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో స్థానిక అధికారులు కర్ఫ్యూ విధించారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతలు భారత్-నేపాల్ సరిహద్దు వద్దకు వ్యాపించడంతో భారత్ అప్రమత్తమైంది.

ఎమర్జెన్సీ సేవలు మినహా సరిహద్దు దాటే కదలికలను పూర్తిగా నిషేధిస్తూ భారత్ సరిహద్దును మూసివేసింది. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) దళాలు హై అలర్ట్‌పై ఉంచారు. ఈ చర్యతో సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్యం, ప్రజల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

నేపాల్ పోలీసులు సంఘటనకు సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. భారత్ వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News