Maoists: ఛత్తీస్‌గఢ్‌లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు

Update: 2025-09-24 11:57 GMT

Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం 71 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లను ముమ్మరం చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాల కారణంగా నక్సల్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కోసం తీవ్రంగా కృషి చేస్తుండటంతో లొంగిపోవడం తప్ప వారికి వేరే మార్గం లేదని ఆయన అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు గతంలో పలు విధ్వంసక సంఘటనల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి పునరావాసం కల్పిస్తామని, హింసాత్మక కార్యకలాపాలను విడనాడి సమాజంలో భాగమయ్యే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

‘ఆపరేషన్ కగార్’ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల వల్ల మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News