Vise President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఆగస్టు 9వ తేదీన పోలింగ్;
By : Politent News Web 1
Update: 2025-08-01 07:41 GMT
జగదీప్ ధన్‌ఖర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 21వ తేదీ వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. 22వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఆగస్టు 25వ తేదఈ నామినేషన్ల ఉపసహంరణకు చివరి రోజు. ఆగస్టు 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అవసరమైతే ఆదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.