రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం

భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం కూలింది;

Update: 2025-07-09 10:43 GMT

రాజస్థాన్‌ లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. చురు జిల్లా రతన్‌గఢ్ ప్రాంతంలోని భానుడా గ్రామ సమీపంలో ఈ రోజు(బుధవారం) ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఇద్దరు వైమానిక సిబ్బంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. ప్రమాదం సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఫైటర్‌ జెట్‌ పొలాల్లో కూలిందని, భారీగా మంటలు, పొగ ఎగసిపడినట్లు చెప్పారు.

Tags:    

Similar News