Major Operation in Delhi Ahead of New Year Celebrations: న్యూఇయర్ వేడుకల ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్.. ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం!

285 మంది అరెస్ట్.. ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం!

Update: 2025-12-27 11:24 GMT

Major Operation in Delhi Ahead of New Year Celebrations: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో నేరాలు అరికట్టేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 'ఆపరేషన్ ఆఘాత్ 3.0' పేరిట ఆగ్నేయ దిల్లీ జిల్లాలో భారీ ఎత్తున దాడులు నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో దాదాపు 1000 మందికి పైగా అనుమానితులను విచారించగా, 285 మందిని వివిధ చట్టాల కింద అరెస్టు చేశారు. వీరిలో ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, ఎన్‌డీపీఎస్ యాక్ట్, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులు ఉన్నాయి. అదనంగా 116 మంది బ్యాడ్ క్యారెక్టర్స్‌ను, 10 మంది ఆస్తి నేరస్థులను, 5 మంది ఆటో లిఫ్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

దాడుల్లో 21 దేశీ తుపాకులు, 20 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, 27 కత్తులతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్ (గంజాయి సహా), అక్రమ మద్యం, నగదు, దొంగిలించిన వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ సందర్భంగా నేరాలు పెరిగే అవకాశం ఉండటంతో ఈ ముందస్తు ఆపరేషన్ చేపట్టినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ చర్యలతో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడమే లక్ష్యమని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) హేమంత్ తివారీ పేర్కొన్నారు. వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలాంటి డ్రైవ్‌లు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News