Prime Minister Modi: నూతన సంవత్సరం: 2026 అందరికీ అద్భుతమైన ఏడాది కావాలి.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Update: 2026-01-01 11:18 GMT

ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ శుభాకాంక్షలు

Prime Minister Modi: కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికే సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ దేశ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీ తన సందేశంలో ఈ విధంగా పేర్కొన్నారు:

"ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభించాలని ఆకాంక్షిస్తున్నా. సమాజంలో శాంతి, ఆనందం నెలకొని ఉండాలని ప్రార్థిస్తున్నాను."

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో ఇలా అన్నారు:

"దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన సంవత్సరం కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక. ఆత్మపరిశీలనకు, కొత్త సంకల్పాలు తీసుకునేందుకు ఇది మంచి అవకాశం. దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతను చాటుకుందాం. 2026 మనందరి జీవితాల్లో శాంతి, సంతోషం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను."

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ:

"2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే మన సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను."

పాత ఏడాదికి వీడ్కోలు చెప్పి కొత్త ఆశలతో ప్రపంచం 2026లోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా జరిగిన వేడుకలు ఘనంగా సాగాయి.

Tags:    

Similar News