Trending News

2026 T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బంగ్లా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

బంగ్లా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

Update: 2026-01-23 05:02 GMT

2026 T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్ పాల్గొనడం ఇక కష్టమే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ బరిలోకి దిగడం లాంఛనమే కానుంది. వచ్చే నెల 7న మొదలయ్యే మెగా టోర్నీ కోసం తమ జట్టును ఇండియా పంపించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) గురువారం తేల్చిచెప్పింది. ఇండియాలో తమ ఆటగాళ్లకు భద్రతలేదని, అక్కడ జట్టు ఆడలేదని ఐసీసీకి తెలిపింది. అయినప్పటికీ ఐసీసీ తమకు న్యాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను శ్రీలంక తరలించాలన్న బీసీబీ విజ్ఞప్తిని తిరస్కరించిన ఐసీసీ.. షెడ్యూల్ ప్రకారం ఇండియాలోనే ఆడాలని లేదంటే టోర్నీ నుంచి తప్పిస్తామని అల్టిమేటం జారీ చేసింది. అయినా తమ జట్టును ఇండియా పంపించబోమని బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ప్రకటించాడు. ‘వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యేందుకు మా క్రికెటర్లు చాలా కష్టపడ్డారు. కానీ, మా ప్లేయర్లు, జర్నలిస్టులు, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియాలో సరైన భద్రత ఉంటుందన్న నమ్మకం మాకు లేదు. అందుకే జట్టును ఇండియా పంపకూడదని నిర్ణయించాం. ఇది మా ప్రభుత్వ నిర్ణయం. అయినా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే విషయంలో మేం ఆశలు కోల్పోవడం లేదు. టోర్నీకి మా టీమ్ రెడీగా ఉంది. మా టీమ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను శ్రీలంకలో ఆడించి ఐసీసీ న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నాం’ అని పేర్కొన్నాడు. ఇండియాలో ఆడలేమని బంగ్లా బోర్డు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు బంతి ఐసీసీ కోర్టులో ఉంది. బీసీబీ నిర్ణయంపై ఇంకా స్పందించని ఐసీసీ.. బంగ్లా స్థానంలో ఆడాలని స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డుకు సమాచారం ఇచ్చిందో లేదో తెలియరాలేదు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే చాన్సుంది.

ఆటగాళ్లలో ఆందోళన.. బంగ్లా బోర్డుకు చావుదెబ్బ!

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బంగ్లా జట్టు వైదొలిగితే అది బీసీబీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టనుంది. ఐసీసీ నుంచి వచ్చే సుమారు రూ. 225 కోట్ల వార్షిక ఆదాయంతో పాటు, స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్, టీవీ ప్రసార హక్కుల రూపంలో వచ్చే ఆదాయంలో 60 శాతం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆగస్టులో జరగాల్సిన టీమిండియా టూర్ కూడా రద్దయ్యే అవకాశం ఉండటంతో బీసీబీ ఆర్థిక పునాదులు కదిలిపోయే స్థితికి చేరుకున్నాయి. మరోవైపు, ఈ రాజకీయ నిర్ణయం పట్ల బంగ్లాదేశ్ ఆటగాళ్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయినా అధికారుల ఆగ్రహానికి భయపడి మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News