3rd Test: విజయానికి 135 పరుగుల దూరంలో టీమిండియా
135 పరుగుల దూరంలో టీమిండియా;
3rd Test: లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 58 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది.
అంతకు ముందు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ (4/22) స్పిన్ మ్యాజిక్‌కు తోడు మహ్మద్ సిరాజ్ (2/31), జస్‌ప్రీత్ బుమ్రా (2/38) ఆకట్టుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 62.1 ఓవర్లలో 192 రన్స్‌కే ఆలౌటైంది.జో రూట్ 40, కెప్టెన్ బెన్ స్టోక్స్ 33 మాత్రమే రాణించారు.
ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసిన ఆనందం ఇండియాకు ఎంతోసేపు నిలువలేదు. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఎదురు దెబ్బ తగిలింది. 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్.. ఇండియా చెరో టెస్టు గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.