Afghan Cricketer Urges India: పాక్ దాడులపై భారత్ జోక్యం చేసుకోవాలి..అఫ్గాన్ క్రికెటర్ విజ్ఞప్తి

అఫ్గాన్ క్రికెటర్ విజ్ఞప్తి

Update: 2026-03-18 12:53 GMT

Afghan Cricketer Urges India: ఆఫ్ఘానిస్తాన్ లోని కాబూల్ పై పాకిస్తాన్ దాడుల చేయడంపై భారత్ చోరవ తీసుకో వాలని ఆదేశ క్రికెటర్ గజన్ ఫర్ కోరారు. ఈ దాడుల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై అల్లా గజన్ ఫర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశమైన భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మా ప్రజలు ఇప్పటికే ఎన్నో కష్టా ల్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి దాడులు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ఈ రక్తపాతాన్ని ఆపడా నికి ప్రపంచం ముందుకు రావాలి అని ఆయన తన సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తా ను ఎల్లప్పుడూ అండగా నిలిచే భారత్, ఈ క్లిష్ట సమయంలో కూడా తమ గొంతును అంతర్జాతీయ వేదికలపై వినిపించాలని ఆయన కోరారు. ఆఫ్ఘన్ క్రికెటర్లకు భారత్ రెండో ఇల్లు వంటిదని, ఇక్కడి ప్రజల మద్దతు తమకు ఎంతో అవసరమని ఆయన పేర్కొ న్నారు. కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, మానవతా దృక్పథం తో తమ దేశంలో జరుగుతున్న హింసను అరికట్టాలని సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News