Asia Cup 2025: పాక్ ను చిత్తు చేసిన భారత్..

చిత్తు చేసిన భారత్..

Update: 2025-09-15 04:02 GMT

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్తాన్‌ ను చిత్తు చేసింది. సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు పడగొట్టాడు.

128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు, కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), ఓపెనర్లు అభిషేక్ శర్మ (31), తిలక్ వర్మ (31) అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన కుల్దీప్ యాదవ్, 18 పరుగులకు 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విజయం భారత జట్టు ఆసియా కప్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఓమన్ తో ఆడనుంది

Tags:    

Similar News